Ibrahim Zadran : దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమైన అఫ్గనిస్థాన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) సర్జరీ చేయించుకున్నాడు. ఎడమ మోకాలి గాయంతో బాధ పడుతున్న అతడు తనకు ఇంగ్లండ్‌లో సర్జరీ విజయవంతం అయిందని చెప్పాడు. మంగళవారం జద్రాన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సర్జరీ అనంతరం దవాఖానలో బెడ్ మీద పడుకొని ఉన్న ఫొటోలను అఫ్గన్ ఆటగాడు ఎక్స్ వేదికగా పెట్టాడు.
‘మీలో కొందరికి తెలిసే ఉంటుంది. నా మోకాలికి ఈమధ్యే గాయం అయింది. ఈ రోజు సర్జరీ ద్వారా వైద్యులు దాన్ని ఫిక్స్ చేశారు. ఆపరేషన్ విజయవంతం అయింది. ఇక కోలుకోవడం మీదనే నా దృష్టంతా’ అని జద్రాన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఆ పోస్ట్ చూసిన పలువురు క్రికెటర్లు ‘జద్రాన్ నువ్వు త్వరగా కోలుకోవాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
As some of you may know, I injured my ankle recently, and today I underwent surgery to fix it. Alhamdulillah, the operation was successful, and I’m now focused on my recovery. Dr James was exceptional, and I am forever grateful for his services. pic.twitter.com/YHrzMP0sva
— Ibrahim Zadran (@IZadran18) September 24, 2024
జద్రాన్ పోస్ట్ చూసిన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) సైతం స్పందించాడు. ‘తొందరగా కోలుకోవాలి’ అంటూ ఈ డాషింగ్ బ్యాటర్ కామెంట్ పెట్టాడు. రెండేండ్ల క్రితం కారు యాక్సిడెంట్లో గాయపడిన పంత్ కూడా మోకాలి సర్జరీ చేయించుకున్నాడు.
Good to back 🤞😇.
Chennai heat, the perfect run.
First test win, the job well done. 🏏☀️💪#RP17 pic.twitter.com/5h2jDGdOcl— Rishabh Pant (@RishabhPant17) September 22, 2024
సర్జరీ తర్వాత రికవరీ అయిన పంత్.. ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా షాన్‌దార్ ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు.. టీ20 వరల్డ్ కప్‌లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. ఇక సుదీర్ఘ ఫార్మాట్లో పంత్ సెంచరీతో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. చెపాక్ టెస్టులో బంగ్లాదేశ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 109 పరుగులతో చెలరేగి జట్టు విజయంలో భాగమయ్యాడు.