DGP | ప్రముఖ శక్తిపీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు రావాలని తెలంగాణ డీజీపీ జితేందర్‌కు దేవస్థానం ఆధ్వర్యంలో ఆహ్వానం అందించారు. ఆలయ ఈవో పురేందర్ కుమార్, ప్రధాన అర్చకులు దిండిగల్ ఆనంద్ శర్మ డీజీపీని కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. అలాగే అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఐజీ రమేశ్‌ను కలిసి ఆహ్వానపత్రికను అందించారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులకు జోగులాంబ అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించి శేషవస్త్రాలతో సత్కరించారు.