MBBS Councelling | ప్రస్తుత విద్యా సంవత్సరం (202425)లో ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం కాళోజీ నారాయణ రావు ఆరోగ్య యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును ఈ నెల 25న అంటే బుధవారం ఉదయం విడుదల చేస్తాం అని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి మంగళవారం తెలిపారు.
ఎంబీబీఎస్ కోర్సులో చేరడానికి నీట్-2024 రాసిన విద్యార్థుల్లో తుది మెరిట్ జాబితాను గురువారం నాడు విడుదల చేస్తామని డాక్టర్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు సిద్దంగా ఉండాలని తెలిపారు.
గత విద్యా సంవత్సరంలో కాలేజీల వారీగా సీట్ల అలాట్మెంట్ వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు వాటిని పరిశీలించి వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకుంటే, ఆప్షన్ల నమోదు ప్రక్రియ సులభం అవుతుందని డాక్టర్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.