Rishabh Pant : ఇంగ్లండ్ గడ్డపై సెంచరీల మోతతో రిషభ్ పంత్ (Rishabh Pant) పలు రికార్డులను బద్ధలు కొట్టాడు. లీడ్స్‌లోని హెడింగ్లే టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో శతకాలు బాదిన రెండో వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించిన పంత్ మరిన్ని మైలురాళ్లకు చేరువలో ఉన్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గనుక ఈ డాషింగ్ బ్యాటర్ మూడంకెల స్కోర్ కొడితే దిగ్గజాల సరసన నిలుస్తాడు. వెటరన్ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా పంత్ పేరు రికార్డు పుస్తకాల్లో చేరుతుంది. మొత్తంగా ఏడో ఆటగాడిగా గుర్తింపు సాధిస్తాడీ చిచ్చరపిడుగు.
టెస్టు క్రికెట్లో సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న రిషభ్ పంత్‌కు విదేశాల్లో ఘనమైన రికార్డు ఉంది. 2022 పర్యటనలో ఇంగ్లండ్‌పై వంద కొట్టిన పంత్ ఈసారి కూడా తాను ఎంత ప్రమాదకరమో ఆతిథ్య జట్టుకు తెలియజేశాడు. లీడ్స్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో కదం తొక్కాడీ వికెట్ కీపర్. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ అతడు వంద కొడితే.. వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీ సాధించిన ఏడో క్రికెటర్‌గా చరిత్రకెక్కుతాడు.
Only the 2️⃣nd wicket-keeper with 2️⃣ tons in a Test 💯🧤
Is Pant India’s greatest ever Test wicket-keeper? 🔥
Cricbuzz experts weigh in, right here#RishabhPant #ENGvIND pic.twitter.com/oRHAVXp2mm
— Cricbuzz (@cricbuzz) June 28, 2025
ఇంగ్లండ్‌పై వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీలు కొట్టిన పర్యాటక జట్టు ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. బ్రాడ్‌మన్ ద్రవిడ్, బ్రియాన్ లారా, చార్లెస్ జార్జ్ మెకర్టే, వారెన్ బార్డ్స్లే, డారిల్ మిచెల్ ఇదివరకూ ఈ రికార్డు నెలకొల్పారు. ద్రవిడ్ 2002లో ఇంగ్లండ్‌పై మూడు మ్యాచుల్లో శతకాలతో రెచ్చిపోయాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా 2022లో మార్ష్ ఈ ఫీట్ సాధించాడు.
It is going to sting us for a while but we BELIEVE in bouncing back stronger.#RP17 pic.twitter.com/IIhhDJQTn2
— Rishabh Pant (@RishabhPant17) June 24, 2025
లీడ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేసిన పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. అయితే.. టెయిలెండర్ల వైఫల్యంతో స్టోక్స్ సేనకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది భారత్. ఆఖరి రోజు పేసర్లు విఫలం కాగా.. బెన్ డకెట్ సూపర్ సెంచరీకి జో రూట్ హాఫ్ సెంచరీ తోడవ్వగా 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.