Unofficial 1st Test : గాయం నుంచి కోలుకున్న రిషభ్ పంత్ (Rishabh Pant) ఫామ్ చాటుకున్నాడు. దక్షిణాఫ్రికా ఏ బౌలర్లను ఉతికేసిన అతడు భారత ఏ జట్టును గెలుపు వాకిట నిలిపాడు. బెంగళూరులోని సీఈవో మైదానంలో జరుగుతున్న అనధికారిక టెస్టులో బంతితో తనుష్ కొతియాన్(4-26) ప్రత్యర్ధిని దెబ్బకొట్టగా.. పంత్ హాఫ్ సెంచరీ(64 నాటౌట్)తో చెలరేగారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో గొప్పగా పుంజుకొని మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. చివరి రోజున మరో 156 పరుగులు చేస్తే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టడం ఖాయం.
స్వదేశంలో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు గెలుపు దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న టీమిండియా.. మూడో రోజు ప్రత్యర్థిని కుప్పలకూల్చింది. ఓవర్‌నైట్ స్కోర్ 30/0తో ఇన్నింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఏ జట్టుకు తనుష్ కొతియాన్ (4-26), అన్షుల్ కంభోజ్(3-39)లు షాకిచ్చారు. వీరిద్దరూ హడలెత్తించగా 199కే కుప్పకూలింది. ఓపెన్ లెసెగో సెనొక్వెనె(37), జుబయిర్ హంజా(37)లు టాప్ స్కోరర్లు.
కాసేపటికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 32కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్(64 నాటౌట్) తనదైన స్టయిల్లో రెచ్చిపోయాడు. అజేయంగా నిలచిన పంత్ నాలుగో రోజు దంచేశాడంతో లంచ్‌లోపే మ్యాచ్ ముగిసే అవకాశముంది.
RISHABH PANT BACK IN GAME🔥
Commentator: “No one can do lip service better than Rishabh Pant himself. ”
Next ball, he dances down the track and sends it straight down the ground for six.
Pure Pant. Pure intent. pic.twitter.com/k5PtEPifCJ— RP17 Fanᵀᵉˡᵘᵍᵘ 🇮🇳 (@TeluguRP17Fan) November 1, 2025
తొలి ఇన్నింగ్స్‌లో తనుష్ కొతియాన్(4-83), గుర్నూర్ బ్రార్(2-45)ల విజృంభణతో సఫారీ టీమ్ 309కి ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సాయి సుదర్శన్(32), ఆయుశ్ మాత్రే(65)లు శుభారంభం ఇచ్చినా మిగతావాళ్లు స్వదినియోగం చేసుకోలేకపోయారు. పేసర్లను దీటగా ఎదుర్కొన్న ఓపెనర్లు తొలి వికెట్‌కు 91 రన్స్ జోడించారు. కానీ, సఫారీ స్పిన్నర్ సుబ్రయేన్(5-61) కీలక వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. గాయం నుంచి కోలుకొని కెప్టెన్‌గా ఆడుతున్న రిషభ్ పంత్(17) స్వల్ప స్కోర్‌కే సెలే ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత ఆయుశ్ బదొని(38).. తనుష్ కొతియాన్(13)లు కుదురుకున్నా పెద్ద స్కోర్ చేయలేకపోయారు. దాంతో. 234కే టీమిండియా ఆలౌటయ్యింది.