సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్టులో భారత బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh Pant) తీవ్రంగా పోరాడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలు బాడీలైన్ బంతులతో ఇబ్బంది పెడుతున్నా.. ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇప్పటికే పలుమార్లు రిషబ్ శరీరానికి బంతులు బలంగా తగిలాయి. వికెట్‌ను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాడు. రెండు సార్లు ఫిజియో కూడా గ్రౌండ్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఓసారి స్టార్క్ వేసిన బౌన్సర్.. పంత్ భుజం వద్ద తగిలింది. బోలాండ్ వేసిన మరో బంతి అతని థై ప్యాడ్స్ పైభాగాన తగిలింది. దీంతో ఫిజియో వచ్చి పంత్‌కు చికిత్స అందించాల్సి వచ్చింది.
Rishabh Pant took a number of heavy hits to the body.#AUSvIND pic.twitter.com/TdyJ1qhm9C
— cricket.com.au (@cricketcomau) January 3, 2025
ఆస్ట్రేలియా బౌలర్లు ఇవాళ ఉదయం నుంచి తమ స్పీడ్ బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ముప్పుతిప్పలుపెడుతున్నారు. అయినా కానీ పంత్ నిలకడగా స్కోరింగ్ చేసి .. చివరకు బోలాండ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రవీంద్ర జడేజాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు పంత్. ఆ ఇద్దరూ అయిదో వికెట్‌కు ఇప్పటికే 48 రన్స్ జోడించారు. మెల్బోర్న్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి.. సిడ్నీ టెస్టులో డకౌట్ అయ్యాడు. పంత్ అవుటైన తర్వాత బంతికే నితీశ్ రెడ్డి కూడా ఔటయ్యాడు. 57 ఓవర్లలో ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 120 రన్స్ చేసింది.