సిడ్నీ: సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్(Pant) ఓ భారీ సిక్సర్(Sixer) కొట్టాడు. అతను కొట్టిన పవర్ షాట్‌కు.. బంతి ఏకంగా సైడ్స్క్రీన్పై చిక్కుకుపోయింది. బ్యూ వెబ్‌స్టర్ వేసిన 46వ ఓవర్లో .. పంత్ తన పవర్ స్ట్రోక్‌తో అలరించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో పంత్ పలుమార్లు బౌలర్ల ఆగ్రహానికి గురయ్యాడు. అనేక బంతులు అతని శరీరానికి బలంగా తగిలాయి. కొన్ని దెబ్బలకు అతను ఫిజియో నుంచి చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే వెన్నుచూపని పంత్.. కొత్త బౌలర్ వెబ్‌స్టర్ బౌలింగ్ లో లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. బంతి సైట్ స్క్రీన్‌పై చిక్కుకోవడాన్ని దాన్ని తీసేందుకు గ్రౌండ్ స్టాఫ్ రంగంలోకి దిగింది. నిచ్చెన వేసుకుని మరీ ఆ బంతిని తీశారు. ఆ షాట్ వీడియోను ఎంజాయ్ చేయండి.
A six so big the ground staff needed a ladder to retrieve it!#AUSvIND pic.twitter.com/oLUSw196l3
— cricket.com.au (@cricketcomau) January 3, 2025