IPL Mock Auction : ఐపీఎల్ మెగా వేలానికి కౌంట్‌డౌన్ మొదలైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆదివారం మధ్నాహ్నాం వేలం ప్రక్రియకు తెరలేవనుంది. అందుకని ఎవరెవరిని కొనాలి? ఎంత ధరకు దక్కించుకోవాలి? అనే విషయమై కసరత్తు పూర్తి చేశాయి పది ఫ్రాంచైజీలు. మెగా వేలానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ రికార్డు ధర పలికేది ఎవరు? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. అందరూ ఊహించినట్టే డాషింగ్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) అత్యధిక ధరకు అమ్ముడుపోగా.. కేఎల్ రాహుల్ (KL Rahul) సైతం భారీగానే పలికాడు. అయితే.. నిజమైన వేలంలో కాదు.. ఇదంతా జియో సినిమా నిర్వహించిన మాక్ వేలం ముచ్చట.
ఐపీఎల్ మెగా వేలంలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ రికార్డు బ్రేకర్స్‌గా నిలుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అందుకు తగ్గట్టే.. శనివారం ఆద్యంత సరదాగా నిర్వహించిన ఐపీఎల్ మాక్ వేలంలో పంత్, రాహుల్ అత్యధిక ధరతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. పంజాబ్ కింగ్స్ తరఫున ఇయాన్ మోర్గాన్ వేలంలో పాల్గొని పంత్‌ను రూ.33 కోట్లకు కొన్నాడు.
KL Rahul Sold For Rs 29.5 Cr In IPL Mock Auction, Pant Gets Crazy Fee Of… https://t.co/NWKHvDUlfv pic.twitter.com/1sDiniLCob
— CricketNDTV (@CricketNDTV) November 23, 2024
రాహుల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 29.5 కోట్లకు దక్కించుకుంది. గత వేలంలో రికార్డు ధరతో చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్‌ను ముంబై ఇండియన్స్ రూ.18 కోట్లకు తన్నుకుపోయింది. ఇక యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మళ్లీ పంజాబ్ జట్టే కొన్నది. కాకపోతే రూ.16.5 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.15 కోట్లు చెల్లించేందుకు సిద్దమైంది. యువ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.15.5 కోట్లకు పట్టేసింది. అయితే.. మాక్ వేలంలో మాదిరిగానే రేపు జెడ్డా వేదికగా ఈ స్టార్ క్రికెటర్లు రికార్డు ధర పలకడం ఖాయం అంటున్నారు కొందరు.
#IPLMegaAuction 2025 Explained: Quick guide to teams, players, RTM, live streaming and venue
👉 https://t.co/tsCJoaxx2C #IPL2025Auction #IPLAuction #BCCI pic.twitter.com/zBObeBJK1g
— TOI Sports (@toisports) November 23, 2024