IND vs PAK : ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా ఓవర్లో ఓపెనర్ ఫఖర్ జమాన్(15) ఔటయ్యాడు. అతడు ఆడిన బంతి ఎడ్జ్ తీసుకోగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ చక్కగా క్యాచ్ అందుకున్నాడు. అయితే.. బంతి ముందుగా నేలకు తగిలి ఉందేమోనని టీవీ అంపైర్ రివ్యూ కోరారు అంపైర్లు. రివ్యూలో ఫేర్ క్యాచ్ అని తేలడంతో ఫఖర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం సయీం ఆయూబ్ (4), ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్ (6) ఆడుతున్నారు. మూడు ఓవర్లకు పాక్ స్కోర్.. 26/1.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ తొలి ఓవర్లోనే బతికిపోయింది. హార్దిక్ పాండ్యా సంధించిన మూడో బంతిని ఓపెనర్ షహిబ్జద ఫర్షాన్(6) థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేపిన బంతిని అభిషేక్ శర్మ వదిలేశాడు. ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకోవాలని అనుకున్న అభి.. చివరకు నేలపాలు చేశాడు. దాంతో.. డకౌట్ అయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు పాక్ ఓపెనర్. ఆ తర్వాత బుమ్రాను టార్గెట్ చేస్తూ వరుసగా రెండు ఫోర్లు బాదాడు ఫఖర్ జమాన్(15). అయితే.. ధాటిగా ఆడి స్కోర్ బోర్డు వేగం పెంచాలనుకున్న అతడికి పాండ్యా చెక్ పెట్టాడు.
Breakthrough for #TeamIndia! 👏 👏
Hardik Pandya 🤝 Sanju Samson
Updates ▶️ https://t.co/CNzDX2HKll#AsiaCup2025 | #Super4 | @hardikpandya7 | @IamSanjuSamson pic.twitter.com/mWCSJcB0Pj
— BCCI (@BCCI) September 21, 2025