Hardik Pandya : పొట్టి ప్రపంచకప్ కోసం వెయింటింగ్.. అన్నట్టుగా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చెలరేగిపోతున్నాడు. మూడు నెలల తర్వాత పునరాగమనం మ్యాచ్‌లోనూ అభిమానులకు పూనకాలు తెప్పించిన పాండ్యా.. టీ20ల్లో వేగవంతమైన అర్ధ శతకం బాదేశాడు. సిరీస్ డిసైడర్ ఐదో మ్యాచ్‌లో శివమెత్తిన ఈ ఆల్‌రౌండర్ దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తూ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. తద్వారా ఈ ఫార్మాట్లో టీమిండియా తరఫున రెండో వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడీ హిట్టర్. అనంతరం స్టాండ్స్‌లోని తన ప్రేయసి మహీకా శర్మ వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు పాండ్యా.
పొట్టి ఫార్మాట్లో సంచలన ఇన్నింగ్స్‌లతో అలరించే హార్దిక్ పాండ్యా ఆటే వేరు. క్రీజులోకి వచ్చాడంటే బంతితో చెడుగుడు ఆడుకుంటాడీ పవర్ హిట్టర్. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తన ప్రతాపం చూపిస్తున్న భారత స్టార్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో చెలరేగాడు. సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పాండ్యా.. సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కార్బిన్ బాష్ ఓవర్లో 6, 4, 6తో 16 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడీ చిచ్చరపిడుగు.
Hardik Pandya’s flying kiss steals the show!
Spotted with girlfriend Mahieka Sharma cheering wildly from the stands – goals! 💗#HardikPandya #INDvSA
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) December 19, 2025
అతడి విధ్వంసంతో అభిషేక్ శర్మ (17 బంతులు) మూడో స్థానానికి పడిపోయాడు. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే యాభైతో టాప్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ ఆరంభ సీజన్లో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో చరిత్ర లిఖించిన యూవీ.. అదే ఊపుతో వేగవంతమైన ఫిఫ్టీని తన పేరిట రాసుకున్నాడు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లు 18 బంతుల్లో హాఫ్ సెంచరీ తో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
Pulls crowd like Virat & Rohit
Farms Aura Like Akshay Khanna
Six Hitting like Peak Andre Russell
Finish Matches like MS Dhoni
Playboy mindset like Chris GayleHardik Pandya is the reason I watch T20 matches these days.#INDvSA
— Hardik_trends (@Hardik_trends) December 19, 2025