Hardhik Pandya – Natasha : భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardhi Pandya), నటాషా స్టాంకోవిక్ (Natasha Stankovic)లు విడిపోయి దాదాపు రెండు నెలలు కావోస్తోంది. అసలు వాళ్ల మధ్య ఏం గొడవ జరిగింది? ఎందుకు విడిపోయారు? అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. అన్యోన్యంగా నాలుగేండ్లకు పైగా సాగిన ప్రణయ ప్రయాణాన్ని అర్ధాంతరంగా ఆపేయడం వెనుక మతలబు ఏంటీ? అనేది హార్దిక్ అభిమానులకు ఇప్పటికీ పెద్ద ప్రశ్నగానే మిగిలింది. అయితే.. పాండ్యా – నటాషా విడాకులకు కారణం ఏంటో తెలిసిసోయింది. హార్దిక్, నటాషాలతో సన్నిహితంగా ఉన్న ఒకరు ఏం చెప్పారంటే.. హార్దిక్ పాండ్యా వైఖరితోనే ఇద్దరూ విడిపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.
‘పాండ్యా తాను చాలా తెలివైనవాడిని, తానే ముఖ్యమైనవాడిని అన్నట్టుగా ప్రవర్తించేవాడు. అతడి తీరు నటాషాకు నచ్చేది కాదు. దాంతో, ఆమె అతడితో ఇంతకుముందులా ఉండలేకపోయింది. అలా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ ఎడబాటు కాస్త విడాకులకు దారి తీసింది’ అని సదరు వ్యక్తి తెలిపారు. అయితే.. అదే కచ్చితమైన కారణమని చెప్పలేం. ఎందుకుంటే.. విడాకుల ముందుగానీ, తర్వాతగానీ పాండ్యా – నటాషాలు తమ బ్రేకప్ కారణం చెప్పలేదు.
According to Media Reports: The Reason behind Hardik Pandya’s divorce with Natasa Stankovic revealed #Cricket #CricketNews #HardikPandya #NatasaStankovic pic.twitter.com/Hn466fDuzC
— SportsTiger (@The_SportsTiger) August 24, 2024
టీ 20 వరల్డ్ కప్ హీరోగా స్వదేశం వచ్చిన పాండ్యా వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టుగానే భార్య నటాషాతో తెగతెంపులు చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాడంటే..? ‘నాలుగేండ్ల దాంపత్య జీవితం తర్వాత పరస్పర ఒప్పందంతో నటాషా, నేను విడాకులకు సిద్ధమయ్యాం. కలిసి బతికేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ, కుదరలేదు.
దాంతో, ఇద్దరి ప్రయోజనాల మేరకు విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు పుట్టిన అగస్త్య ఇక ముందు కూడా మా ఇద్దరి ప్రేమను పొందనున్నాడు. కో పేరెంట్‌గా అతడికి అన్ని సమకూర్చడమే కాకుండా, అతడిని సంతోషంగా ఉంచుతాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతకు భంగం కలిగించ వద్దని అభిమానులను కోరుతున్నా’ అని పాండ్యా వెల్లడించాడు.
మోడల్ అయిన నటాషాకు, పాండ్యాకు కరోనా సమయం (Corona Time)లోపెళ్లి అయింది. ప్రస్తుతం ఈ జంటకు అగస్త్య (Agastya) అనే పిల్లాడు ఉన్నాడు. అయితే.. హార్దిక్ – నటాషాలు ఈ మధ్యే రెండోసారి వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు. కొడుకు ఉన్నాక మళ్లీ పెండ్లి చేసకోవడానికి కారణం ఎంటో తెలుసా..? 2020 మార్చి 31న అతికొద్ది మంది సమక్షంలో కోర్టులో హార్దిక్, నటాషాల పెళ్లి జరిగింది.
అది కరోనా టైమ్ కావడంతో సాదాసీదాగా వీళ్లిద్దరూ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. పరిస్థితులు చక్కబడ్డాక బంధు, మిత్రుల ముందు వైభవంగా మనువాడాలని హార్దిక్, నటాషాలు అప్పుడే నిర్ణయించుకున్నారు. అందుకు ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ముహూర్తం పెట్టుకున్నారు. ఉదయ్‌పూర్ వేదికగా కన్నులపండువగా వీళ్లు రెండోసారి వివాహం చేసుకున్నారు. కుమారుడు అగస్త్యను ఎత్తుకొని మురిసిపోతూ ఫొటోలు దిగారు. అనుకున్నట్టుగానే తమ పెళ్లిని అందమైన జ్ఞాపకంగా మలచుకున్న విషయం తెలిసిందే.