NRI Shot | అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైపై అతడి ఇంట్లో కాల్పులు.. వీడియో వైరల్
NRI Shot | అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైపై ఇద్దరు వ్యక్తులు అతడి ఇంట్లో కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అమృత్సర్: అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైపై ఇద్దరు వ్యక్తులు అతడి ఇంట్లో కాల్పులు జరిపారు. (NRI Shot) బుల్లెట్ గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమెరికా నివాసి అయిన సుఖ్‌చైన్ సింగ్ అనే ఎన్నారై నెల రోజుల క్రితం సొంతూరైన డబుర్జి గ్రామానికి వచ్చాడు. హోటల్, లగ్జరీ కారు కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
కాగా, శనివారం ఉదయం తలపాగా ధరించిన ఇద్దరు సాయుధ వ్యక్తులు బైక్‌పై సుఖ్‌చైన్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. లోనికి ప్రవేశించిన ఆ ఇద్దరు గన్ చూపించి అతడితో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో ఉన్న పిల్లలు, అతడి తల్లి ఏమీ చేయవద్దని వారిని ప్రాథేయపడ్డారు. అయితే సుఖ్‌చైన్ సింగ్‌ను బలవంతంగా బెడ్రూమ్లోకి తీసుకెళ్లేందుకు ఆ ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో తల, మెడపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సుఖ్‌చైన్ సింగ్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుఖ్‌చైన్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. అత్త వారింటికి సంబంధించిన ఆస్తి వివాదం వల్ల స్థానిక గ్యాంగ్ సభ్యులు అతడిపై కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ਪੰਜਾਬ ਵਿੱਚ ਅਮਨ ਕਾਨੂੰਨ ਦੀ ਸਥਿਤੀ ਬਿਲਕੁਲ ਵਿਗੜ ਚੁੱਕੀ ਹੈ, ਪੰਜਾਬ ਦੇ ਅੱਜ ਦੇ ਹਾਲਾਤ ਦੇਖ ਬਹੁਤ ਦੁੱਖੀ ਹਾਂ, ਅੱਜ ਸਵੇਰੇ ਦੁਬੁਰਜੀ, ਸ੍ਰੀ ਅੰਮ੍ਰਿਤਸਰ ਸਾਹਿਬ ਦੇ NRI ਵੀਰ ਸੁਖਚੈਨ ਸਿੰਘ ਦੇ ਘਰ ਵੜ ਕੇ ਬਦਮਾਸ਼ਾਂ ਨੇ ਸ਼ਰੇਆਮ ਗੋਲੀਆਂ ਚਲਾ ਦਿੱਤੀਆਂ।
ਮਾਤਾ ਜੀ ਆਪਣੇ ਪੁੱਤ ਅਤੇ ਮਾਸੂਮ ਬੱਚਾ ਆਪਣੇ ਪਿਤਾ ਨੂੰ ਬਚਾਉਣ ਲਈ ਹੱਥ ਜੋੜ ਰਹੇ ਹਨ… pic.twitter.com/WJbQws2SAL— Sukhbir Singh Badal (@officeofssbadal) August 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

