T20 World Cup: పాకిస్థాన్ నెట్ రన్‌రేట్ తగ్గుతుంది.. సుమారు 200 కోట్ల యాడ్ రెవన్యూ నష్టం
T20 World Cup: భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరిస్తే, టోర్నీలో ఆ దేశ నెట్ రన్‌రేట్ తగ్గనున్నది. భారత్ రన్‌రేట్‌కు ఎటువంటి సమస్య ఉండదు. ఇక ఇండోపాక్ మ్యాచ్ రద్దు అయితే.. ఆ మ్యాచ్‌ను ప్రసారం చేసే జియో స్టార్‌కు సుమారు 200 కోట్ల యాడ్ రెవన్యూ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది.
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)లో ఈనెల 15వ తేదీన గ్రూపు స్టేజ్‌లో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఆ నిర్ణయం వల్ల పాకిస్థాన్‌పై చాలా ప్రభావం పడనున్నది. టోర్నీలో పాకిస్థాన్ నెట్ రన్‌రేట్ తగ్గనున్నది. మ్యాచ్ నుంచి తప్పుకోవడం వల్ల పాకిస్థాన్‌కు ఎటువంటి లాభం జరిగే అవకాశం లేదు. ఐసీసీ నియమావళి ప్రకారం.. భారత్ నెట్ రన్‌రేట్‌లో మార్పు ఉండబోదు. ఐసీసీ నియమావళి 16.10.7 ప్రకారం ఏదైనా జట్టు టోర్నీలో ఓ మ్యాచ్ నుంచి కావాలని వైదొలగితే .. తప్పుకున్న జట్టుకు చెందిన నెట్ రన్‌రేట్‌పై ప్రభావం పడనున్నది. డిఫాల్ట్ టీమ్‌కు చెందిన 20 ఓవర్లను పరిగణలోకి తీసుకుంటారు. టోర్నీలో ఓవర్‌కు సగటును స్కోరు చేసిన రన్స్ ఆధారంగా పాకిస్థాన్‌కు నష్టం జరిగే అవకాశం ఉన్నది.
భారత్‌తో జరిగే మ్యాచ్‌ను రద్దు చేస్తే . ఆ దేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల వల్ల పాకిస్థాన్‌కు ప్రయోజనం ఉండబోదు. ఐసీసీ ఆంక్షల ప్రకారం వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లను పాకిస్థాన్ కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇక వరల్డ్ కప్ మ్యాచ్‌లను స్పాన్సర్ చేస్తున్న బ్రాడ్‌కాస్టర్ జియో స్టార్‌కు నష్టపరిహారాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెల్లించాల్సి ఉంటుంది. ఇండోపాక్ మ్యాచ్ రద్దు కావడం వల్ల జియోస్టార్‌కు భారీ మొత్తం ఆదాయానికి గండిపడే ఛాన్సు ఉన్నది. ఆ మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరిస్తే, సుమారు 200 కోట్ల అడ్వర్టైజ్మెంట్ రెవన్యూ నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఐసీసీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టోర్నమెంట్లో ఒకవేళ అవసరమైతే పాకిస్థాన్ స్థానంలో ఉగాండాను ఆడించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం జరిగే వర్చువల్ మీటింగ్‌లో దీనిపై ఐసీసీ నిర్ణయం తీసుకోనున్నది. కానీ మ్యాచ్ బహిష్కరణ గురించి పీసీబీ నుంచి ఇంకా అధికారికంగా ఐసీసీకి ఎంటుంటి సమాచారం అందలేదు. పాకిస్థాన్ ప్రభుత్వ ప్రకటన రాజకీయ ఉద్దేశంతో కూడినట్లుగా ఉందని భావిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. తమ వేదికలను మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడం వల్ల ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించామని, కానీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాక్ తీసుకున్న చర్యను రాజకీయ నిరసనగా భావిస్తామని ఐసీసీ అభిప్రాయపడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

