పాక్ కష్టంగా..
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు తమ తొలి మ్యాచ్‌లోనే చావుతప్పి కన్ను లొట్టపోయే పరిస్థితి ఏర్పడింది. శనివారం జరిగిన పోరులో పాక్ 3 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై చెమటోడ్చి నెగ్గింది. నిర్దేశిత 148 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో మూడు బంతులు మిగిలుండగా 7వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది.
- నెదర్లాండ్స్‌పై ఉత్కంఠ విజయం
- ఆదుకున్న ఫహీమ్ అష్రఫ్
కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు తమ తొలి మ్యాచ్‌లోనే చావుతప్పి కన్ను లొట్టపోయే పరిస్థితి ఏర్పడింది. శనివారం జరిగిన పోరులో పాక్ 3 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై చెమటోడ్చి నెగ్గింది. నిర్దేశిత 148 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో మూడు బంతులు మిగిలుండగా 7వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్(47) రాణించగా, ఆఖర్లో ఫహీమ్ అష్రఫ్(11 బంతుల్లో 29 నాటౌట్, 2ఫోర్లు, 3సిక్స్‌లు) ఆపద్బాంవునిలా ఆదుకున్నాడు. అయితే డచ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో ఒక దశలో 90/2తో మెరుగ్గా కనిపించిన పాక్ 16.1 ఓవర్లలో 114కు 7 వికెట్లు కోల్పోయింది.
చివరి రెండు ఓవర్లలో జట్టు విజయానికి 29 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన అష్రఫ్ మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో గెలుపు సమీకరణం కాస్తా ఆరు బంతుల్లో 5 పరుగులకు చేరగా, లీడ్ బౌలింగ్‌లో ఫోర్‌తో అష్రఫ్ మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు కెప్టెన్ ఎడ్వర్డ్స్(37), లీడె(30) రాణించడంతో నెదర్లాండ్స్ 147 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

