న్యూఢిల్లీ: భారత్‌లో జరగనున్న జూనియర్ హాకీ వరల్డ్ కప్(Junior Hockey World Cup) నుంచి పాకిస్థాన్ వైదొలగినట్లు అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ద్రువీకరించింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు జూనియర్ హాకీ వరల్డ్‌కప్ జరగాల్సి ఉన్నది. చెన్నై, మధురై వేదికల్లో ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే పాకిస్థాన్ తప్పుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో మరో జట్టును ప్రకటించనున్నట్లు హాకీ ఫెడరేషన్ పేర్కొన్నది. వాస్తవానికి టోర్నీలోని గ్రూప్ బీలో పాకిస్థాన్ ఉన్నది. ఆ గ్రూపులోనే భారత్, చిలీ, స్విట్జర్లాండ్ దేశాలు ఉన్నాయి.
భారత్‌లో జరుగుతున్న టోర్నీల నుంచి పాకిస్థాన్ వైదొలగడం ఇదే రెండో సారి. ఇటీవల మెన్స్ ఆసియాకప్ నుంచి కూడా పాక్ టీమ్ తప్పుకున్నది. బీమార్లోని రాజ్‌గిర్‌లో ఆ టోర్నమెంట్ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు జరిగింది. పెహల్గామ్ ఉగ్రదాది తర్వాత రెండు దేశాల మద్య క్రీడా సంబంధాలు బలహీనపడిన విషయం తెలిసిందే. జూనియర్ హాకీ వరల్డ్‌కప్ నుంచి పాకిస్థాన్ తప్పుకున్న విషయంపై తమకు సమాచారం లేదని హాకీ ఇండియా పేర్కొన్నది.