ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చెందింది. భారత్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే సునాసయంగా ఛేదించింది.
తొలుత టాస్ గెలిచి పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముందుగా భారత్ బ్యాటింగ్ బరిలోకి దిగింది. అయితే.. భారత్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ.. తొలి బాల్కే డక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా మరో రెండు వికెట్లు పడటంతో భారత్ కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయినా.. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ భారత్‌ను ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసి టీమిండియా స్కోర్ పెంచినా.. కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ బాట పట్టడంతో భారత్ స్కోర్ నెమ్మదించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 151 పరుగులు చేసి పాకిస్థాన్‌కు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
తమ ఇన్నింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. అలవోకగా గెలిచేసింది. పాక్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్.. ఇద్దరే పాకిస్థాన్‌ను గెలిపించారు. ఇద్దరు భాగస్వామ్యంతో పాక్‌కు పరుగులు అందించారు. పాక్ ఆటగాళ్ల వికెట్లు తీసేందుకు భారత్ పోరాడింది. కానీ.. వికెట్లను మాత్రం తీయలేకపోయింది. దీంతో పాక్ ఓపెనర్లే మ్యాచ్‌ను 10 వికెట్ల తేడాతో గెలిపించారు.
17.5 ఓవర్లలో 152 పరుగులు చేసి అలవోకగా భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ ఛేదించింది. పాక్ ఆటగాళ్లు రిజ్వాన్ 55 బంతుల్లో 78 పరుగులు చేయగా.. బాబర్ అజామ్ 52 బంతుల్లో 68 పరుగులు చేశాడు.
టీమిండియా కీ ప్లేయర్స్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వికెట్లు తీసిన పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
Match 16. It's all over! Pakistan won by 10 wickets https://t.co/eNq46RHDCQ #INDvPAK #T20WC
— BCCI (@BCCI) October 24, 2021
Pakistan record their first-ever win in ICC Men's T20 World Cup against India!🇵🇰🙌#WeHaveWeWill pic.twitter.com/gsr5ooBcNe
— Pakistan Cricket (@TheRealPCB) October 24, 2021
𝐖𝐇𝐀𝐓. 𝐀. 𝐏𝐄𝐑𝐅𝐎𝐑𝐌𝐀𝐍𝐂𝐄 🔥#T20WorldCup | #INDvPAK | https://t.co/74tB9RjNUH pic.twitter.com/DHagg9XqtN
— ICC (@ICC) October 24, 2021