ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ కీలక మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఆతిథ్య జట్టుతో ఆక్లాండ్‌లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ 16 ఓవర్లలోనే దంచేసి రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్‌లోనే అరంగేట్రం చేసి తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్‌గా వెనుదిరిగిన ఓపెనర్ నవాజ్ (45 బంతుల్లో 105 నాటౌట్, 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో వీరవిహారం చేయగా కెప్టెన్ సల్మాన్ అలీ (51 నాటౌట్), హరిస్ (41) కివీస్ బౌలింగ్‌ను బెంబేలెత్తించి 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించారు. తొలుత చాప్మన్ (44 బంతుల్లో 94, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరవడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించినా బౌలర్ల వైఫల్యంతో కివీస్‌కు పరాభవం తప్పలేదు.