లాహోర్: ఐపీఎల్‌తో పాటు సమాంతరంగా పాకిస్థాన్‌లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సైతం వాయిదా పడింది. పాక్ ప్రధాని మహ్మద్ షెహబాజ్ ఆదేశాలతో తాము పీఎస్ఎల్ను వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు పీఎస్ఎల్ను పాక్ నుంచి తరలించి దుబాయ్‌లో ఆడించనున్నారన్న వార్తలొచ్చాయి.
కానీ భారత్‌తో సత్సంబంధాలున్న ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. పీసీబీ అభ్యర్థనను తోసిపుచ్చడంతో ఆ దేశానికి శృంగభంగమైంది. అయితే పీఎస్ఎల్ను ఎన్ని రోజులు వాయిదా వేస్తున్నారనే దానిపై మాత్రం స్పష్టత లేదు.