ICC Awards | బాబర్ ఆజమ్ డబుల్ ధమాకా.. పాక్ కెప్టెన్ ఖాతాలో రెండు ఐసీసీ అవార్డులు
ICC Awards | గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐసీసీ అవార్డుల్లో దూకుడు కనబర్చాడు. వరుసగా రెండో ఏడాది అత్యుత్తమ ఆటగాడిగా నిలువడంతో పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ICC Awards | దుబాయ్: గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐసీసీ అవార్డుల్లో దూకుడు కనబర్చాడు. గతేడాది (2022) ఆటతీరుకు గానూ ఐసీసీ తాజాగా అవార్డులు ప్రకటించగా.. వాటిలో ఉత్తమ క్రికెటర్ (సర్ గారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)తో పాటు, ఉత్తమ వన్డే క్రికెటర్ అవార్డును పాకిస్థాన్ సారథి కైవసం చేసుకున్నాడు. 2021లోనూ బాబర్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకోవడం విశేషం. 2022లో మూడు ఫార్మాట్లలో కలిపి రెండు వేలకు పైగా పరుగులు రాబట్టిన బాబర్.. 54.12 సగటు నమోదు చేసుకున్నాడు. ఇందులో 8 సెంచరీలు 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఒక క్యాలెండర్ ఇయర్లో బాబర్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. వన్డే ఫార్మాట్లో 9 మ్యాచ్‌లాడి 679 పరుగులు సాధించిన 28 ఏండ్ల బాబర్.. వరుసగా రెండో ఏడాది అత్యుత్తమ ఆటగాడిగా నిలువడంతో పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 9 మ్యాచ్‌ల్లోనే 84.87 సగటు నమోదు చేసిన బాబర్.. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
విరాట్‌తో పోల్చుతూ..
కెరీర్ తొలినాళ్లలోనే మంచి స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్న బాబర్ ఆజమ్‌ను పాకిస్థాన్ మీడియా ఆకాశానికి ఎత్తింది. ఇంజమాముల్ హక్, సయ్యద అన్వర్, మహమ్మద్ యూసుఫ్‌తో పోల్చుతూ హీరోను చేసింది. అయితే మైదానం వెలుపలి విషయాలకు పెద్దగా ప్రాధాన్యమివ్వని బాబర్.. నిధానంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న బాబర్.. ఆ తర్వాత మరింతగా చెలరేగిపోయాడు. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగకపోవడం.. కేవలం ఐసీసీ మెగాటోర్నీల్లో మాత్రమే తలపడుతుండటంతో అతడు పెద్దగా వెలుగులోకి రాలేకపోయాడు. వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, జింబాబ్వే, శ్రీలంక వంటి జట్లపై పరుగులు సాధిస్తూ.. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో మాత్రం బాబర్ చక్కటి ఇన్నింగ్స్‌తో రాణించి తన ఆట.. గాలివాటం కాదని నిరూపించాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని బాబర్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటు గతేడాది ప్రదర్శనకు రెండు పురస్కారాలు చేజిక్కించుకున్నాడు.
టెస్టు క్రికెటర్‌గా బెన్ స్టోక్స్
సంప్రదాయ క్రికెటకు అధిక ప్రాధాన్యతనిచ్చి.. పరిమిత ఓవర్ల ఆటను పెద్దగా పట్టించుకోదనే అపవాదున్న ఇంగ్లండ్.. గత కొన్నేండ్లలో పూర్తిగా మారిపోయింది. 2015 వన్డే ప్రపంచకప్ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న ఆ జట్టు నాలుగేండ్లు తిరిగేసరికి జట్టును సమూలంగా మార్చివేసింది. దంచికొట్టేవాళ్లనే జట్టులో అవకాశమిస్తూ.. మెరికల్లాంటి వీరులను తయారు చేసుకుంది. దీంతో 2019లో తొలిసారి వన్డే ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఆ టోర్నీలో ఇంగ్లిష్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్.. టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆ జట్టు రూపురేఖలు మారిపోయాయి. ‘బజ్ బాల్’ ఆటతీరుతో చెలరేగిపోతున్న ఇంగ్లిష్ టీమ్ స్టోక్స్ సారథ్యంలో ఆడిన 10 టెస్టుల్లో తొమ్మిందిట నెగ్గిందంటే అతడి జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. న్యూజిలాండ్, దక్షిణాప్రికా, పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్ విజయాలు సాధించడంలో ప్రధాన పాత్ర వహించిన బెన్ స్టోక్స్ 2022 సంవత్సరానికి గానూ అత్యుత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ఇంగ్లండ్ కెప్టెన్ స్కీవర్ ‘మహిళల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’తో పాటు.. ‘మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కించుకుంది.
2022 పురస్కార గ్రహీతలు
మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బాబర్ ఆజమ్ (పాకిస్థాన్)
వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బాబర్ ఆజమ్ (పాకిస్థాన్)
వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ స్కీవర్ (ఇంగ్లండ్)
మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)
ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్)
స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఆసిఫ్ షేక్ (నేపాల్)
Read More :
MS Dhoni | ఎంఎస్ ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

