ముల్తాన్: ఆసియాకప్(Asia Cup)లో భాగంగా ఇవాళ నేపాల్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. తమపై ఎటువంటి వత్తిడి లేదని, ఆటగాళ్లు ఈ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నారు. ఇంత పెద్ద టోర్నీలో ఆడడం సంతోషంగా ఉందని నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ తెలిపారు. 15 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో ఆసియా క్రికెట్ టోర్నీ జరుగుతోంది. ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనున్నది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్థాన్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉంది.
🚨 T O S S A L E R T 🚨
Pakistan win the toss and elect to bat first 🏏#PAKvNEP | #AsiaCup2023 pic.twitter.com/iuuZfKfQv1
— Pakistan Cricket (@TheRealPCB) August 30, 2023
ICYMI: Our playing XI for the opening match of #AsiaCup2023 👇#PAKvNEP pic.twitter.com/dUzdzZMOyH
— Pakistan Cricket (@TheRealPCB) August 30, 2023