BAN vs PAK : ఆసియ కప్‌లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ మరోసారి ఆరంభంలోనే కష్టాల్లో పడింది. బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణకు సూపర్ 4 చివరి మ్యాచ్‌లో 33 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. తస్కిన్ తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫర్హాన్(4)ను ఔట్ చేసి వికెట్ల వేటకు తెరతీశాడు. అంతే.. చూస్తుండగానే టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ప్రస్తుతం కెప్టెన్ సల్మాన్ అఘా(19 నాటౌట్), మొహమ్మద్ హ్యారిస్(8 నాటౌట్)లు జట్టును ఆదుకునే పనిలో ఉన్నారు. 10 వర్లకు స్కోర్.. 47-4.
ఫైనల్ బెర్తును నిర్ణయించే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగుతున్నారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫర్హాన్(4)ను తస్కిన్ వెనక్కి పంపగా.. ఆ తర్వాత హసన్ వేసిన ఓవర్లో సయీం ఆయూబ్ డకౌట్‌గా ఔటయ్యాడు. దాంతో.. ఆ జట్టు పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 27 రన్స్ చేసింది. కెప్టెన్ సల్మాన్ అఘా(19 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకోవాలనుకున్న ఫఖర్ జమాన్(13)ను రిషద్ హొసేన్ ఔట్ చేసి పాకిస్థాన్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. గత మ్యాచ్‌లో శ్రీలంకపై కీలక ఇన్నింగ్స్ ఆడిన తలాటి(3) సైతం రివర్స్ స్వీప్ ఆడబోయి హోసెన్ చేతికి చిక్కాడు. అంతే 33కే నాలుగు వికెట్లు పడ్డాయి.
Saim Ayub now has four ducks in Asia Cup 2025 pic.twitter.com/GdkATcTxQe
— ESPNcricinfo (@ESPNcricinfo) September 25, 2025