పల్లెకిలే: ఆసియాకప్(Asia Cup 2023)లో భాగంగా ఇవాళ భారత్, పాకిస్థాన్ మధ్య శ్రీలకంలో వన్డే మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్తోంది. అప్పడే తుది జట్టును పాక్ ప్రకటించింది. ఈ టోర్నీలో నేపాల్‌తో ఆడిన జట్టే.. ఇండియాతోనూ ఆడనున్నది. ముగ్గురు పేస్ బౌలర్లు, ముగ్గురు స్పిన్ బౌలర్లతో పాక్ రంగంలోకి దిగనున్నది. నిజానికి పాక్ జట్టులో ఇఫ్తాకర్ అహ్మద్ స్థానం కొంచెం డౌట్లో ఉండేది. కానీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను సెంచరీ చేశాడు. దీంతో ఇప్పుడు ఇఫ్తాకర్ ప్లేస్ ఫిక్స్ అయ్యింది. వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌లో పాక్ జట్టు.. నేపాల్‌పై 238 రన్స్ తో నెగ్గిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం అయ్యే ఈ మ్యాచ్ కోసం ఇండియా ఇంకా తన తుది జట్టును ప్రకటించలేదు. అయితే రాహుల్ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ ఓ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తాడో క్లారిటీ లేదు. అక్షర్ పటేల్‌ను తీసుకోవాలా లేక శార్దూల్ థాకూర్‌ను తీసుకోవాలన్న సంశయంలో టీమ్ ఉంది. బుమ్రా, సిరాజ్, షమీ, కుల్దీప్లకు తుది జట్టులో చోటు దక్కే ఛాన్సు ఉంది.
ICYMI, Pakistan have announced their playing XI for the crucial Asia Cup clash against India ⬇️https://t.co/xDXfG1WB7q
— ICC (@ICC) September 2, 2023
పాక్ జట్టు: ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్, ఆఘా సల్మాన్, ఇఫ్తాకర్ అహ్మద్, షాదాబాద్ ఖాన్, మహమ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీశ్ రౌఫ్.