లాహోర్: కెప్టెన్ బాబర్ ఆజమ్ (83 బంతుల్లో 114; 11 ఫోర్లు, ఒక సిక్సర్), ఇమామ్ (106) సెంచరీలతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ విజయం సాధించింది. తొలి వన్డేలో ఆసీస్ గెలుపొందగా గురువారం పాక్ అందుకు బదులు తీర్చుకుంది. తొలుత ఆస్ట్రేలియా 8 వికెట్లకు 348 పరుగులు చేసింది. బెన్ మెక్డెర్మాట్ (104) శతక్కొట్టగా.. ట్రావిస్ హెడ్ (89), లబుషేన్ (59), స్టోయినిస్ (49) రాణించారు. అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది.