సిల్హెట్: మహిళల ఆసియాకప్‌లో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టుకు.. తొలి పరాజయం ఎదురైంది. మొదటి మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకున్న హర్మన్‌ప్రీత్ బృందం.. శుక్రవారం జరిగిన పోరులోపాకిస్థాన్ చేతిలో 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ నిదా డార్ (56), కెప్టెన్ బిస్మా మారూఫ్ (32) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, పూజ వస్ర్తాకర్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మన అమ్మాయిలు 19.4 ఓవర్లలో 124 రన్స్‌కు ఆలౌటయ్యారు. రిచా ఘోష్ (26), హేమలత (20) పోరాడినా తక్కినవాళ్లు విఫలమవడం దెబ్బకొట్టింది.