Haider Ali : అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన పాకిస్థాన్ క్రికెటర్ హైదర్ అలీ (Haider Ali)కు ఊరట లభించింది. సరైన సాక్ష్యాధారాలు లభించనందున అతడిని నిర్దోషిగా పరిగణించింది కోర్టు. లండన్‌లోని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అతడిపై నమోదైన కేసును కొట్టివేశారు. దాంతో.. ఊచలు లెక్కపట్టాల్సిన ఈ యువ కెరటం ‘హమ్మయ్య బతికిపోయాను’ అని ఊపిరిపీల్చుకున్నాడు. అత్యాచారం కేసు కారణంగా నిషేధానికి గురైన ఈ యంగ్ స్టార్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.
అసలేం జరిగిందంటే.. లండన్‌లో ఒక మహిళ హైదర్ అలీ తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తామిద్దరం జూలై 23న మాంచెస్టర్‌లోని ఒక హోట్‌లో కలిశామని.. అక్కడే అలీ తనను రేప్ చేశాడని చెప్పింది. ఆగస్టు 1న ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అయితే.. పాక్ క్రికెటర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తనకు ఆ మహిళ స్నేహితురాలు మాత్రమే అని పోలీసులకు తెలిపాడు హైదర్ అలీ.
24-year-old Pakistan batter was under investigation since August 5https://t.co/Bntx5AeCiD
— CrickIt (@CrickitbyHT) September 4, 2025
అంతేకాదు దర్యాప్తు ఆసాంతం అతడు పోలీసులకు పూర్తిగా సహకరించాడు. దాంతో.. ఈ యంగ్ ప్లేయర్‌ను బెయిల్‌పై విడుదల చేసింది కోర్టు. విచారణ జరిపిన తర్వాత సదరు మహిళపనై అలీ అత్యాచారానికి పాల్పడ్డాడు అనడానికి తగిన ఆధారాలు లభించలేదని పోలీసులకు కోర్టుకు తెలిపారు. దాంతో.. అతడిని నిర్దోషిగా ప్రకటించారు న్యాయమూర్తి. హైదర్ ఇప్పటివరకూ పాక్ తరఫున రెండు వన్డేలు, 35 టీ20లు ఆడాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2020 సీజన్లో ఈ యంగ్‌స్టర్ 157 స్ట్రయిక్ రేటుతో 239 రన్స్ సాధించాడు.
ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా అత్యాచారం కేసులో హైదర్ అలీని ఆగస్టు 4న పోలీసులు అరెస్ట్ చేశారు. మాంచెస్టర్ నగరంలోని పోలీసులు బెక్న్హమ్ ప్రాంతంలోని మైదానంలో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ ఏ టీమ్ షాహీన్ స్క్వాడ్‌లో ఒకడైన హైదర్‌ను విచారించిన తర్వాత అతడు బెయిల్ మీద విడుదలయ్యాడు. అయితే.. కేసులో ఇరుక్కున్న హైదర్‌పై పాకిస్తాన్ బోర్డు వేటు వేసింది. అతడి స్థానంలో మహమ్మద్ ఫయీక్ను ఎంపిక చేశారు సెలెక్టర్లు.