కార్డిఫ్: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో దారుణంగా ఓడిన పాకిస్థాన్ టీమ్‌తో ఆడుకుంటున్నారు అక్కడి అభిమానులు. ట్విటర్లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముగ్గురు ప్లేయర్స్‌కు కరోనా సోకడంతో అందుబాటులో ఉన్న ఓ సెకండ్ రేట్ టీమ్‌ను ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ సెలెక్ట్ చేసింది. దీంతో ఈ సిరీస్‌లో పాకిస్థానే హాట్ ఫేవరెట్ అని అంతా భావించారు. కానీ తొలి వన్డేలోనే ఆ టీమ్‌కు ఊహించని షాక్ తగిలింది. 36 ఓవర్లలోపే కేవలం 141 పరుగులకే పాక్ బ్యాట్స్‌మెన్ చాప చుట్టేశారు. ఈ టార్గెట్‌ను ఇంగ్లండ్ వికెట్ మాత్రమే కోల్పోయి 21.5 ఓవర్లలోనే చేజ్ చేసింది.
ఈ మ్యాచ్‌తోనే ఇంగ్లండ్ టీమ్‌లో ఏకంగా ఐదుగురు వన్డేల్లో అరంగేట్రం చేయడం విశేషం. బెన్ స్టోక్స్ సిరీస్ కోసం స్టాండిన్ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాంటి టీమ్ పూర్తి బలగంతో ఉన్న పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఫ్యాన్స్.. ట్విటర్లో పాక్ టీమ్ పరువు తీశారు. కెన్యాతోనో, జింబాబ్వేతోనో సిరీస్ పెట్టుకోండని ఒకరు.. ఫుల్ స్ట్రెంత్తో ఉన్న ఇంగ్లండ్ టీమ్‌పై శ్రీలంక ఇంతకన్నా బాగా ఆడిందని మరొకరు ట్విటర్లో కామెంట్ చేశారు.
Pathetic performance from Pakistan in every department. Big wake up call. Against England 3rd eleven it was the worst performance i have seen for a very long time. Club level batting, very average bowling sorry not good enough guys. Now you have to win both to win the series.
— khayam Zafar (@khayam999) July 8, 2021