‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ బాబర్
దుబాయ్: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్ రాచెల్ హైన్స్‌కు ఈ పురస్కారం దక్కింది. మార్చి నెలకు గాను వీరిద్దరిని అవార్డులకు ఎంపిక చేసినట్లు ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు ఫార్మాట్ మ్యాచ్‌లలో బాబర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాక్ కెప్టెన్ 390 పరుగులతో రాణించాడు. రెండో టెస్టులో రికార్డు స్థాయిలో 196 పరుగులతో ఆజమ్ అదరగొట్టాడు. అంతటితో ఆగకుండా వన్డేల్లోనూ విశ్వరూపం ప్రదర్శించిన ఆజమ్.. బ్రాత్‌వైట్ (వెస్టిండీస్), కమిన్స్(ఆస్ట్రేలియా)ను అధిగమిస్తూ అవార్డు దక్కించుకున్నాడు. మరోవైపు రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా ఏడోసారి మహిళల వన్డే ప్రపంచకప్ గెలువడంలో రాచెల్ హైన్స్ కీలక పాత్ర పోషించింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో 61.28 సగటుతో 429 పరుగులతో విజృంభించిన హేన్స్.. సోఫీ ఎకెల్‌స్టోన్ (ఇంగ్లండ్), లారా వోల్వార్డ్ (దక్షిణాఫ్రికా) దాటేసి అవార్డు ఖాతాలో వేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

