పార్ల్ : దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాకిస్థాన్ అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యఛేదనలో పాక్ 49.3 ఓవర్లలో 242-7 స్కోరు చేసింది. సయిమ్ ఆయూబ్ (109), సల్మాన్ ఆగా(82 నాటౌట్) రాణించగా, మిగతావారు విఫలమయ్యారు. రబాడ (2-48), బార్ట్మన్ (2-37) రెండేసి వికెట్లు తీశారు. క్లాసెన్ (86), రికల్టన్ (36) ఆకట్టుకున్నారు. అంతకుముందు దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 239-9 స్కోరు చేసింది.