రావల్పిండి: సొంతగడ్డపై పాకిస్థాన్ దుమ్మురేపింది. స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగిన ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో పాక్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను పాక్ 2-1తో కైవసం చేసుకుంది.
ఇంగ్లండ్ నిర్దేశించిన 36 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 3.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 24/3తో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్..112 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్లు నోమన్ అలీ(6/42), సాజిద్‌ఖాన్(4/69) ధాటికి ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రూట్(33) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.