Pakistan | అడిలైడ్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ తొలి వన్డేలో ఓటమిపాలైనా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది. ప్రఖ్యాత అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ (5/29) బంతితో నిప్పులు చెరగగా షహీన్ షా అఫ్రిది (3/26) మెరవడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ (35) టాప్ స్కోరర్.
స్వల్ప లక్ష్యాన్ని పాక్ 26.3 ఓవర్లలోనే పూర్తిచేసింది. యువ ఓపెనర్ సయీమ్ అయూబ్ (82), అబ్దుల్లా షఫీక్ (64 నాటౌట్) తొలి వికెట్కు 137 పరుగులు జోడించి పాక్కు అలవోక విజయాన్ని అందించారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం పెర్త్ వేదికగా జరుగనుంది. ఆస్ట్రేలియా గడ్డపై పాక్కు ఏడేండ్ల తర్వాత ఇదే తొలి విజయం కావడం విశేషం.