రావల్పిండి: సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యమిస్తూ కనీసం గ్రూప్ దశ కూడా దాటకుండా వైదొలిగిన పాకిస్థాన్.. గురువారం రావల్పిండి వేదికగా ఈ టోర్నీలో తమ ఆఖరి మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఆడనుంది. పాక్తో పాటు వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన బంగ్లా కూడా టోర్నీ నుంచి వైదొలిగిన విషయం విదితమే.
సొంతగడ్డపై అభిమానుల అసంతృప్తులు, మాజీ క్రికెటర్ల విమర్శలతో సతమతమవుతున్న రిజ్వాన్ సేన.. ఈ మ్యాచ్లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. తమ నెమ్మదైన బ్యాటింగ్ తీరుతో తీవ్ర విమర్శల పాలవుతున్న బాబర్, రిజ్వాన్ నేటి మ్యాచ్లో ఎలా ఆడతారనేది ఆసక్తికరం.