షార్జా: వెటరన్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పసికూన స్కా్ట్లాండ్పై తన అనుభవంతో దాడి చేశాడు. కేవలం 18 బంతుల్లోనే 54 పరుగులు చేసి పాకిస్థాన్‌కు భారీ స్కోరు అందించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు మొహమ్మద్ రిజ్వాన్ (15), బాబర్ ఆజమ్ (66) నిలకడైన ఆరంభాన్నిచ్చారు.
రిజ్వాన్, ఫఖర్ జమాన్ (8) వెంట వెంటనే అవుటవడంతో పాక్‌పై కొంత ఒత్తిడి పెరిగింది. అయితే అప్పుడే సీనియర్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ (19 బంతుల్లో 31) ఎడాపెడా బౌండరీలు బాదాడు. అదే ఊపులో మరో షాట్‌కు ప్రయత్నించి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్ నిమిషం కూడా ఆగలేదు.
బౌండరీలు బాదడం కోసమే క్రీజులోకి వచ్చినట్లు రెచ్చిపోయాడు. మధ్యలో బాబర్ ఆజమ్ అవుటైనా అతని వేగానికి కళ్లెం పడలేదు. చివర్లో ఆసిఫ్ అలీ (5)తో కలిసి పాకిస్థాన్‌కు 189 పరుగుల భారీ స్కోరు అందించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రీవ్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. హంజా తాహిర్, సఫ్యాన్ షరీఫ్ చెరో వికెట్ కూల్చారు.