షార్జా: పసికూన స్కాట్లాండ్తో మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ (15) ఎక్కువసేపు నిలవలేదు. హంజా తాహిర్ బౌలింగ్‌లో అతను అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (30 నాటౌట్) రాణిస్తున్నాడు.
అతనికి కాసేపు సహకరించిన ఫఖర్ జమాన్ (8) కూడా గ్రీవ్స్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పాకిస్థాన్ జట్టు 59 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం బాబర్ ఆజమ్, హఫీజ్ క్రీజులో ఉన్నారు.