IND vs PAK : ఆసియా కప్ లీగ్ దశలో ఎదరుపడిన భారత్(India), పాకిస్థాన్(Pakistan) సూపర్ 4లోనూ తలపడనున్నాయి. ఆదివారం దుబాయ్ వేదికగా దాయాదుల మధ్య మరోసారి బిగ్ ఫైట్ జరుగనుంది. అయితే.. పాక్ జట్టుకు టీమిండియా ఫోబియా పట్టుకుంది. ఇదివరకే భారీ తేడాతో సూర్యకుమార్ యాదవ్ సేన చేతిలో ఓడడంతో మళ్లీ సల్మాన్ అఘా బృందాన్ని ఓటమి భయం వెంటాడుతోంది. దాంతో.. ఆనవాయితీ ప్రకారం మ్యాచ్‌కు ముందు రోజు జరిగే మీడియా సమావేశాన్ని పాక్ బాయ్‌కాట్ చేసింది. అంతేకాదు.. టీమిండియాను ఎదుర్కొనేందుకు తగిన మానసిక సన్నద్ధత కోసం ఆ జట్టు మోటివేషనల్ స్పీకర్ (Motivational Speaker) సాయం కోరింది.
లీగ్ దశలో భారత బౌలర్ల విజృంభణతో పాక్ జట్టు 127 రన్స్‌కే పరిమితమైంది. స్పల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇప్పుడు సూపర్ 4 మ్యాచ్‌లోనూ చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేయాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో కనీస పోరాటం చేయడానికి పాక్ సన్నద్ధమవుతోంది. అందుకే.. మానసికంగా ధైర్యం, స్ఫూర్తినింపే మాటలు చెప్పే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ రహీమ్‌ను నియమించుకుంది.
Dr Raheel joins national squad to help players handle stress and boost confidence
Read more: https://t.co/w9qRUwdPTR#SamaaTV #AsiaCup2025 #AsiaCup #PakvsInd #PAKvIND #INDvsPAK #PakistanCricket pic.twitter.com/M6OMC4K4mo
— Samaa Sports (@samaasport) September 20, 2025
పాక్ క్రికెటర్లలో రహీం ఆత్మవిశ్వాసాన్ని నూరిపోయనున్నాడు. అయినా సరే అనిశ్చితికి మారుపేరైన దాయది జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేం. ముఖ్యంగా ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేని పాక్ సూపర్ 4లోనూ చేతులెత్తేస్తుందా? చివరి వరకూ పోరాడుతుందా? అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.