Basit Ali : రావల్పిండి టెస్టులో చిత్తుగా ఓడిన పాకిస్థాన్(Pakistan) ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) 2024-25లో వెనకపడింది. దాంతో, సొంతగడ్డపై పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేని ఆ జట్టు ఆటగాళ్లపై వివర్శలు వస్తూనే ఉన్నాయి. అది కూడా బంగ్లాదేశ్‌పై తొలి ఓటమిని ఆ దేశ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు ముందు పాక్ మాజీ కెప్టెన్ బసిత్ అలీ (Basit Ali) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ ఆటగాళ్లు గాడీలో పడాలంటే భారత దేశవాళీ క్రికెట్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అతడు అభిప్రాయ పడ్డాడు. అంతేకాదు బీసీసీఐ నిర్వహిస్తున్న దేశవాళీ క్రికెట్ టోర్నీలను కాపీ కొట్టాలని పీసీబీకి బసిత్ సూచించాడు.’టెస్టు సిరీస్ తర్వాత వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే ఫార్మాట్లో చాంపియన్స్ ట్రోఫీ(champions trophy 2025) ఉంది. ఇప్పటివరకూ పాకిస్థాన్.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల క్రికెట్‌ను అనుసరించింది.
Basit Ali “Pakistan has copied the systems of England, Australia, and New Zealand. India is right next to us, please copy their system too. You need intelligence in copying as well. Just copy what India is doing.” pic.twitter.com/Xm6yBm7ICZ
— Sujeet Suman (@sujeetsuman1991) August 29, 2024
ఇప్పుడు భారత క్రికెట్ వ్యవస్థను కాపీ కొట్టాల్సిన సమయం వచ్చింది. అయితే.. కాపీ కొట్టడం అంటే మక్కీకి మక్కీగా కాకుండా కొంచెం తెలివి ఉపయోగించాలి. ప్రస్తుతం టెస్టు క్రికెట్ కోసం బీసీసీఐ అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయి. త్వరలోనే దులీప్ ట్రోఫీ షురూ కానుంది. టీ20 లేదా వన్డే ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి, భారత ఆటగాళ్లు క్రికెట్ మూలాలపై దృష్టి పెట్టారు. అందుకనే వాళ్లు విజయవంతం అవుతున్నారు’ అని అలీ తెలిపాడు.
స్వదేశంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. నజ్ముల్ హుసేన్ శాంటో సారథ్యంలోని బంగ్లా.. పాకిస్థాన్‌పై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్(191) సూపర్ సెంచరీకి.. యువ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్(77, 4/21) ఆల్‌రౌండ్ షో తోడవ్వడంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 140 రన్స్‌కే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన పర్యాటక జట్టు పాకిస్థాన్ గడ్డపై మరే జట్టుకు సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకుంది.