Reliance AGM | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ తన వాటాదారులకు బోనస్ షేర్లు ఇవ్వనున్నది. 1:1 నిష్పత్తిలో వాటాదారులకు బోనస్ షేర్లు ఇస్తామని గురువారం జరిగిన 47వ రిలయన్స్ వార్షిక వాటాదారుల సమావేశంలో వెల్లడించారు. అంతకుముందు వచ్చేనెల ఐదో తేదీన డైరెక్టర్ల బోర్డు సమావేశం జరుగుతుందని, అందులో 1:1 నిష్పత్తిలో వాటాదారులకు బోనస్ షేర్లు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటుందని స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. ఇంతకుముందు 2017లో తన వాటాదారులకు చివరిసారిగా బోనస్ షేర్లు జారీ చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్-50 కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్ ఉందని ముకేశ్ అంబానీ ఏజీఏం భేటీలో వెల్లడించారు. సమీప భవిష్యత్లో టాప్-30 గ్లోబల్ కంపెనీల సరసన చేరడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇక రిలయన్స్ రిటైల్, టెలికం డివిజన్ల లిస్టింగ్ విషయమై సంస్థ యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయలేదు.
వాటాదారులకు బోనస్ షేర్లు ఇచ్చే విషయమై అధినేత ముకేశ్ అంబానీ ప్రకటన చేసిన వెంటనే దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ షేర్ దూసుకెళ్లింది. గురువారం ఇంట్రాడే ట్రేడింగ్ లో రిలయన్స్ షేర్ 2.63 శాతం వృద్ధి చెంది రూ.3,074.80 లకు చేరుకుంది. బీఎస్ఈ లో ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.64 శాతం లబ్ధితో రిలయన్స్ సేర్ రూ.3,044.75 వద్ద ముగిసింది. మరోవైపు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 0.43 శాతం పుంజుకుని 82,134 పాయింట్ల వద్ద స్థిర పడింది.
Apple – Jobs | ఉద్యోగార్థులకు ఆపిల్ ఆఫర్.. ఏడు నెలల్లో ఆరు లక్షల కొలువులు