Usman Qadir : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam)పై ఆ జట్టు ఆటగాడు ఉస్మాన్ ఖాదిర్(Usman Qadir) సంచలన కామెంట్స్ చేశాడు. బాబర్‌తో స్నేహం తన కెరీర్‌కు ఎంతో ప్రమాదకరమని అన్నాడు. అతడలా చెప్పడానికి ఓ కారణం ఉంది. బాబర్‌తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల తనపై మిగతావాళ్ల కంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని ఉస్మాన్ చెప్పాడు.
‘బాబర్‌తో స్నేహం ఈరోజుది కాదు. అండర్ -15 జట్టుకు ఇద్దరం ఒకేసారి ట్రయల్స్‌లో పాల్గొన్నాం. బాబర్ కెప్టెన్ అయ్యాక నేను జాతీయ జట్టులోకి వచ్చాను. అలాగని అతడు నన్ను తీసుకరాలేదు. మిస్బావుల్ హక్(Misbah-ul-Haq) నన్నుటీమ్లోకి తీసుకొచ్చాడు. బాబర్ స్నేహితుడిని అయినంత మాత్రాన నాకు జట్టులో చోటు దక్కదు. అదంతా సెలెక్టర్లు చేతిలో ఉంటుంది. నిజం చెప్పాలంటే బాబర్‌తో దోస్తాన్ వల్ల నాపై మరింత ఒత్తిడి ఉంటుంది అని ఖాదిర్ తెలిపాడు.
అబ్దుల్ ఖాదిర్, ఉస్మాన్ ఖాదిర్
అఫ్గనిస్థాన్ వన్డే సిరీస్ (Afghanistan ODI series)కు ప్రకటించిన 15మంది బృందంలో ఖాదిర్ చోటు దక్కలేదు. అతను చివరి సారిగా నిరుడు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడాడు. ఈ లెగ్ స్పిన్నర్ ఎవరో తెలుసా..? పాక్ లెజెండ్ అబ్దుల్ ఖాదిర్(Abdul Qadir) కుమారుడు.
ఆసియా కప్(Asia Cup 2023) ముందు పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ జట్లు శ్రీలంక వేదికగా మూడు వన్డేలు ఆడనున్నాయి. హంబన్‌తోటలో ఆగస్టు 22న మొదటి వన్డే జరుగనుంది. రెండో వన్డే ఆగస్టు 24న, మూడో వన్డే ఆగస్టు 26వ తేదీన ఉన్నాయి. ఆ తర్వాత నాలుగు రోజులకే ఆసియా కప్ మొదల్వనుంది. హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఈ టోర్నీకి పాక్, లంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.