Arshad Nadeem : ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem)పై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పాక్ క్రికెటర్ అహ్మద్ షహ్జాద్ బడిసె యోధుడికి కోటి రూపాయలు ప్రకటించాడు. తాజాగా పాక్ – అమెరికన్ వ్యాపారవేత్త అలీ షెకానీ (Ali Sheikhani) సైతం ముందకొచ్చి నదీమ్‌కు సుజికీ ఆల్టో కారును బహుమతిగా ఇస్తానన్నాడు.
ఒలింపిక్ విజేతకు కారు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్న అతడి మంచి మనుసును అంతా మెచ్చుకుంటున్నారు. ‘కానీ, ఆజానుబాహుడైన నదీమ్ ఆ చిన్న కారులో ఎలా పడుతాడు? అసలు ఆ వ్యాపారవేత్తకు దిమాక్ ఉందా?’ అంటూ కొందరు షెకానీని ట్రోల్ చేస్తున్నారు.
ఒలింపిక్స్‌లో రికార్డు త్రోతో నదీమ్ స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. ఫైనల్లో 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పాక్‌కు తొలి పసిడిని అందించాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో పసిడిని ముద్దాడిన నీరజ్ (Neeraj Chopra) .. పారిస్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో భారత స్టార్ అథ్లెట్ 89.45 మీటర్ల దూరం బడిసెను విసిరి వరుసగా రెండో పతకంతో చరిత్ర లిఖించాడు.