T20 World Cup 2024 : పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు ముందే గత సీజన్ ఫైనలిస్ట్ పాకిస్థాన్ (Pakistan)కు భారీ షాక్. ఆ జట్టు ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం(Iamd Wasim) మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బుధవారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) వెల్లడించింది.
‘గురువారం యూఎస్ఏ(USA)తో జరగాల్సిన మ్యాచ్‌కు ఇమాద్ వసీం అందుబాటులో లేడు. పీసీబీ వైద్య బృందం అతడికి కొంత విశ్రాంతి ఇవ్వాలని సూచించింది. అందుకనే వసీమ్‌ను పక్కన పెట్టేశాం’ అని పీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. వసీమ్ స్థానంలో తుది జట్టులో ఎవరిని తీసుకుంటున్నారు? అనేది మాత్రం చెప్పలేదు.
పొట్టి వరల్డ్ కప్ ముందే వసీమ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన వపాకిస్థాన్ సూపర్ లీగ్ పదో సీజన్లో ఈ ఆల్‌రౌండర్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇస్లామాబాద్ యునైటెడ్(Islamabad United) జట్టు చాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. దాంతో, సెలెక్టర్లు ఇమాద్‌ను వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రెండేండ్ల క్రితం (2022లో) ఆస్ట్రేలియా గడ్డపై రన్నరప్‌తో సరిపెట్టుకున్న బాబర్ ఆజాం(Babar Azam) సేన ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గురువారం డల్లాస్‌లోని గ్రాండ్ ప్రియరీ స్టేడియంలో ఆతిథ్య యూఎస్ఏతో పాకిస్థాన్ తలపడనుంది. తొలి పోరులోనే విజయంతో టోర్నీని ఘనంగా మొదలెట్టాలని అనిశ్చితికి మారుపేరైనా పాక్ పట్టుదలతో ఉంది.
పాకిస్థాన్ స్క్వాడ్ : బాబర్ ఆజాం(కెప్టెన్), అబ్రర్ అహ్మద్, అజాం ఖాన్, ఫఖర్ జమాన్, హ్యారిస్ రవుఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమిర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీం అయుబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.