అమరావతి : ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్టికల్ 174 ప్రకారం మంత్రివర్గ సిఫార్సు మేరకు 15వ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితా (Election result ) ల్లో అధికార వైసీపీ ఘోర ఓటమిపాలు కావడంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్(YS Jagan) మంగళవారం రాజీనామా పత్రాన్ని గవర్నర్కు అందజేశారు.
ఈ సందర్భంగా బుధవారం నాడు అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. 15వ శాసన సభకు ఏపీలో 2019 ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగగా మే 23న ఫలితాలు వెలువడ్డాయి . ఈ ఫలితాల్లో వైసీపీ పార్టీ వైఎస్ జగన్ నాయకత్వంలో 175 సీట్లకుగాను 151 సీట్లు సాధించింది. దీంతో ఆయన మే 30 న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
16వ శాసన సభకు భారత ఎన్నికల కమిషన్ రెండు నెలల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో గత నెల 13న ఎన్నికల జరుగగా ఈనెల 4న ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో అధికార వైసీపీ ఓటమి చెందగా సీఎం పదవికి జగన్ రాజీనామా చేశారు. 16వ శాసన సభ త్వరలో కొలువుదీర నున్నది.