కరీంనగర్: అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించే ఐపీఎల్ వంటి మెగా లీగ్‌లో తెలంగాణ గ్రామీణ క్రికెటర్లను చూడాలన్నదే తమ ఆకాంక్ష అని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న హెచ్‌సీఏ సమ్మర్ క్యాంపులలో భాగంగా శనివారం ఆయన కరీంగనర్‌లోని శిబిరాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో మెరికల్లాంటి క్రికెటర్లను వెలికితీస్తామని, ఇందులో భాగంగానే రూ. 1.50 కోట్లు ఖర్చు చేసి సమ్మర్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నామని అన్నారు. త్వరలోనే ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.