IPL 2025 : ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓపెనర్లు రియాన్ రికెల్టన్(31), రోహిత్ శర్మ (26)లు మరోసారి శుభారంభం ఇచ్చారు. జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఉతికేస్తున్నారు. ఆర్చర్ వేసిన 5వ ఓవర్లో రెచ్చిపోయిన రికెల్టన్ 4, 6 బాదగా.. రోహిత్ ఒక బౌండరీ సాధించాడు. థీక్షణ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన హిట్‌మ్యాన్ స్కోర్ 50 దాటించాడు. వర్ ప్లేలో ముంబై పరుగులు చేసింది. రికెల్టన్ సైతం ఓ ఫోర్ కొట్టగా ముంబై 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 58 రన్స్ చేసింది.
జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రియాన్ రికెల్టన్(31), రోహిత్ శర్మ(26)లు ఆచితూచి ఆడుతున్నారు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో 2 పరుగులే వచ్చాయి.
A breezy start in Jaipur 🍃#MI are 16/0 after 3 overs.
Updates ▶️ https://t.co/t4j49gX9NW#TATAIPL | #RRvMI | @rajasthanroyals | @mipaltan pic.twitter.com/GL4j6Bwg1L
— IndianPremierLeague (@IPL) May 1, 2025
ఫజల్ హక్ బౌలింగ్‌లో రోహిత్ బౌండరీతో జోరు పెంచాడు. ఆ తర్వాత థీక్షణ ఓవర్లోనూ ఫోర్ బాదాడు. 3 ఓవర్లలో స్కోర్ 20 దాటలేదు. దాంతో.. ఫజల్ హక్ వేసిన 4 ఓవర్లో రికెల్టన్ చెలరేగాడు. రెండో బంతిని ఫ్లిక్ చేసిన స్టాండ్స్‌లోకి పంపిన అతడు.. ఆ తర్వాత బంతిని డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్‌లో 4 గా మలిచాడు.