బర్మింగ్హామ్: ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (126 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీ కొట్టడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తున్నది. ఓవర్నైట్ స్కోరు 14/0తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.
వార్నర్ (9), లబుషేన్ (0), స్మిత్ (16) విఫలం కాగా.. హెడ్ (50; 8 ఫోర్లు, ఒక సిక్సర్), కారీ (52 బ్యాటింగ్; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలు సాధించారు. చేతిలో 5 వికెట్లు ఉన్న ఆసీస్.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 82 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఆసీస్ 393/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.