Ricky Ponting | గత వారం పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వీరోచిన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన సిక్సర్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోయే షాట్ అని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. ముఖ్యంగా 19వ ఓవర్లో విరాట్ కొట్టిన సిక్సర్స్ మాత్రం అద్భుతం అని చెప్పుకుంటున్నారు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ షాట్ ప్రపంచకప్ చరిత్రలోనే హైలెట్ అని అన్నారు. ఈ మేరకు విరాట్‌పై ప్రశంసలు కురిపించారు. హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో అతడి తల మీదుగా విరాట్ కొట్టిన సిక్సర్‌ను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. ఈ షాట్ గురించి అభిమానులు ఎప్పటికీ చెప్పుకుంటారని తెలిపారు. పరిమిత ఓవర్ల క్రికెట్ మొత్తంలోనే ఈ షాట్ గొప్పదని చెప్పట్లేదు.. కానీ, టీ20 ప్రపంచకప్ వరకు వస్తే మాత్రం ఇది చరిత్రలో నిలిచిపోయే సిక్సరే అని అభిప్రాయపడ్డారు.
వీరోచిన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో 53 బంతుల్లో కోహ్లీ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పాక్ బౌలర్ల తప్పిదాలను క్యాష్ చేసుకున్న విరాట్.. తనదైన స్టైల్లో విరుచుకుపడి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు.