UAE vs Oman : ఆసియా కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన యూఏఈ(UAE), ఒమన్ (Oman) జట్లు బిగ్‌ఫైట్‌కు సిద్ధమయ్యాయి. అబూదాబీలోని షేక్ జయేద్ మైదానంలో ఇరుజట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కెప్టెన్ జతిందర్ సింగ్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో ఇప్పటివరకూ పాయింట్ల ఖాతా తెరవని ఇరుజట్లు విజయంపై కన్నేశాయి. ఈ మ్యాచ్‌లో గెలుపొందినా బోణీ కొట్టాలనే కసితో ఉన్నాయి.
పదిహేడో సీజన్ ఆసియా కప్ పోటీల్లో ఆతిథ్య జట్టు యూఏఈ తొలి పోరులో భారత జట్టు చేతిలో చిత్తుగా ఓడింది. కుల్దీప్ యాదవ్ (4-7), శివం దూబే(3-4)లు విజృంభించగా 57 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ధనాధన్ ఆడిన టీమిండియా 5.5 ఓవర్లలో మ్యాచ్ ముగించింది. మరోవైపు పాకిస్థాన్‌పై కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఒమన్ ఈసారి అదిరే ప్రదర్శన చేయాలనుకుంటోంది. దాంతో.. ఆ జట్టుపై విజయం సాధించడం యూఏఈకి అంత తేలికేమీ కాదు. అయితే.. తమ కెప్టెన్ వసీం స్ట్రోక్ ప్లేతో చెలరేగి భారీ స్కోర్ అందించాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది.
Which of the UAE or Oman will get their first points on the board today in Abu Dhabi?
Follow live: https://t.co/sQPahuOogm pic.twitter.com/imqrFvb9jc
— ESPNcricinfo (@ESPNcricinfo) September 15, 2025
యూఏఈ తుది జట్టు : అలీషాన్ షరాఫు, ముహమ్మద్ వసీం(కెప్టెన్), ముహమ్మద్ జొహైబ్, రాహుల్ చోప్రా(వికెట్ కీపర్), అసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, ముహమ్మద్ రోహిద్, ముహమ్మద్ జవాదుల్లా, జునైద్ సిద్ధిఖీ.
ఒమన్ తుది జట్టు : అమిర్ ఖలీం, జతిందర్ సింగ్(కెప్టెన్), హమ్మద్ మిర్జా, వినాయక్ శుక్లా(వికెట్ కీపర్), వసీం అలీ, హసనైన్ షా, షా ఫైజల్, అర్యన్ బిష్త్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాత్సవ, జితెన్ రమానంది.