Aman Sehrawat : పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన భారత రెజ్లర్ అమన్ షెహ్రావత్ (Aman Sehrawat) పై అభినందనల వర్షం కురుస్తోంది. 21 ఏండ్లకే ఒలింపిక్ పతకం కలను నిజం చేసుకున్న అమన్ భావి రెజ్లర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అరంగేట్ర విశ్వ క్రీడల్లోనే మెడల్ కొల్లగొట్టిన ఈ యువ రెజ్లర్ ప్రమోషన్ సాధించాడు.
ఉత్తర భారత రైల్వేస్ (Northern Railways) అతడిని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా(ఓఎస్డీ) ప్రమోట్ చేసింది. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన వెలువరించింది. ‘ఉత్తర భారత రైల్వే ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో జనరల్ మేనేజర్ శోభన్ చౌదురి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన అమన్ షెహ్రావత్ను అభినందించారు. అనంతరం ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అమన్‌ను ఓఎస్డీగా ప్రమోట్ చేశారు. ఫ్రీస్టయిల్ రెజ్లర్ అయిన అమన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో దేశ గౌరవాన్ని, కీర్తిని పెంచాడు. అతడి అంకితభావం, కష్టపడే గుణం లక్షలాదిమందికి స్ఫూర్తిదాయకం’ అని ఉత్తర రైల్వే పీఆర్వో వెల్లడించారు.
Congratulations to Aman Sehrawat for clinching the Bronze Medal in Wrestling Men’s Freestyle 57 kg at the #ParisOlympics2024!
Aman, your incredible achievement has made the nation proud!#Cheer4Bharat pic.twitter.com/dmkoM1iMny
— Dr Sudhakar K (@DrSudhakar_) August 9, 2024
చిన్నతనం నుంచి రెజ్లింగ్‌ను ఇష్టపడిన అమన్ అదే క్రీడలో ఆరితేరాదు. అయితే.. అతడి విజయాన్ని కళ్లారా
చూడకుండానే తల్లిదండ్రులు కాలం చేశారు. ఒకదశలో రెజ్లింగ్‌ను వదిలేద్దామనుకున్న అమన్.. మేనమామ చొరవతో మళ్లీ మట్టిలోకి దిగాడు. కుస్తీలో మెలకువలు నేర్చుకొని సీనియర్లను ఓడించి సత్తా చాటాడు.
ఒలింపిక్ ట్రయల్స్‌లో టోక్యోలో రజతం గెలిచిన రవి దహియాను మట్టికరిపించిన అమన్.. పారిస్‌లో పతకంతో మెరిశాడు. 57 కిలోల విభాగంలో తన ఉడుంపట్టుతో దేశానికి ఐదో కాంస్యం అందించాడు. దాంతో, 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి ప్రతిసారి విశ్వ క్రీడల్లో రెజ్లర్లు పతకాలు సాధిస్తున్న ఆనవాయితీని అమన్ కొనసాగించాడు.