Sharwa 37 | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి Sharwa 37. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమ, నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి. అద్భుతమైన ఫన్ రైడ్.. అంటూ ఏకే ఎంటర్టైన్మెంట్స్ షేర్ చేసిన లుక్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా శర్వా 37 షూటింగ్ లొకేషన్లో ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు. సెట్లో దేశభక్తి అంటూ షేర్ చేసిన స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.
మరోవైపు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న Sharwa 36 కూడా ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది.. గూస్బంప్స్ తెప్పించే అడ్వెంచరస్ రైడ్‌కు సిద్దంగా ఉండండి.. అంటూ శర్వానంద్ టీం ఓ లుక్ కూడా షేర్ చేసింది.
Patriotism on set 🇮🇳
Team #Sharwa37 celebrates Independence Day on the sets by hoisting the National flag ❤️🔥#HappyIndependenceDay ✨@ImSharwanand @sakshivaidya99 @RamAbbaraju @AnilSunkara1 @Composer_Vishal @dopyuvraj @brahmakadali @aj_sunkara @kishore_Atv @BhanuBogavarapu… pic.twitter.com/M5hnJ5hZRm
— BA Raju’s Team (@baraju_SuperHit) August 15, 2024
Amaran | జవాన్ల సేవలను స్మరించుకుంటూ.. శివకార్తికేయన్ అమరన్ మేకింగ్ వీడియో
Mr Bachchan | ప్రభాస్ అభిమానులకు రవితేజ మిస్టర్ బచ్చన్ టీం స్పెషల్ ట్రీట్.. !