న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ డీఎస్పీగా నియమితులయ్యారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆమెకు నియామక పత్రాలు అందించారు. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో లవ్లీనా భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన ఆమె సెమీస్ చేరారు. అయితే వరల్డ్ నంబర్ వన్ టర్కీకి చెందిన బుసెనజ్తో జరిగిన సెమీస్‌లో ఓడిపోవడంతో ఆమెకు రజత పతకం సాధించింది.
ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత… లవ్లీనాకు డీఎస్పీ ఉద్యోగంతోపాటు రూ.కోటి పారితోషికం ప్రకటించారు. పారిస్ ఒలింపిక్సుకు సన్నద్ధమవడానికి ప్రతి నెలా ఆమెకు రూ.లక్ష అందిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఉదయం లవ్లీనాకు డీఎస్పీ నియామక పత్రం అందజేశారు.
23 ఏండ్ల లవ్లీనా మొదట కిక్ బాక్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. 2018, 2019 ఏఐబీఏ మహిళా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో కాంస్య పతకం గెలిచారు. ఢిల్లీలో జరిగిన మొదటి ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంటులో స్వర్ణ పతకం, గువాహటిలో జరిగిన సెకండ్ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో రజత పతకం సాధించారు.
69 కేజీల వెల్టెర్ వెయిట్ విభాగంలో మూడో రాంక్ పొందిన లవ్లీనా బోర్గోహైన్ అసోం నుంచి ఒలింపిక్స్‌కు క్వాలిపై అయిన తొలి మహిళగా, శివ థాపా తర్వాత రాష్ట్రం నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో బాక్సర్‌గా నిలిచారు.