Ollie Pope | ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 0-2తో వెనుకబడిన ఇంగ్లండ్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైస్ కెప్టెన్ ఒలీ పోప్ సిరీస్‌కు దూరమయ్యాడు. లార్డ్స్ టెస్టులో ఒలీ పోప్ కుడి భుజానికి తీవ్ర గాయమైంది. త్వరలో శస్త్ర చికిత్స చేయనున్నారు. ఇంగ్లండ్ – ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లో భాగంగా ఈ నెల 6 నుంచి హెడింగ్లీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. పోప్ గాయానికి సంబంధించి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకటన విడుదల చేసింది. ‘గత వారం లార్డ్స్‌లో జరిగిన రెండో యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఒలీ పోప్ కుడి భుజానికి గాయంకావడంతో యాషెస్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు’ అని పేర్కొంది. సోమవారం లండన్‌లో నిర్వహించిన స్కానింగ్‌లో గాయం పూర్తి స్థాయిలో బయటపడింది.
అతనికి శస్త్రచికిత్స అవసరం అని తెలిపింది. అతని ప్లేస్‌లో మరో ఆటగాడి పేరును ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ప్రకటించలేదు. వాస్తవానికి ఒలీ పోప్ ఈ సీజన్లో ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో పోప్ తొలి ఇన్నింగ్‌లో 31 పరుగులు, సెకండ్ ఇన్నింగ్‌లో 14 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 42, 3 పరుగులు చేశాడు. సిరీస్‌ను నిలబెట్టుకునేందుకు హెడింగ్లీ టెస్టులో ఇంగ్లండ్ తప్పనిసరిగా గెలువాల్సిన పరిస్థితి ఒక వేళా మ్యాచ్‌లో ఓడినా, డ్రా చేసుకున్నా ఆస్ట్రేలియా యాషెస్‌ను నిలబెట్టుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో యాషెస్‌ను కైవసం చేసుకునేందుకు ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శన చేయాల్సి రానున్నది. మూడు టెస్టుల్లో తమ జట్టు విజయం సాధిస్తుందని కెప్టెన్ బెన్ స్టోక్స్ ధీమా వ్యక్తం చేశాడు.