ODI World Cup | వన్డే ప్రపంచ కప్ టోర్నీ-2023లో భాగంగా సోమవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో30 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు తట్టుకోలేకపోతున్నారు.
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 23 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో మహ్మద్ రిజ్వాల్ (0), బాబర్ ఆజం (33) పరుగులతో ఆడుతున్నారు. 22వ ఓవర్ లో నూర్ అహ్మద్ వేసిన మూడో బంతిని ఆడబోయిన అబ్దుల్లా షఫీ ఎల్బీడబ్ల్యూ అయి పెవిలియన్ కు తిరిగాడు. అవుటయ్యే సమయానికి అబ్దుల్లా షఫీక్ 58 పరుగులు చేశాడు.